నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని రాంరెడ్డి పల్లి, మర్రిగూడ గ్రామాలలో మంగళవారం సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య ఆధ్వర్యంలో నవంబర్ 15 న జరిగే అఖిలభారత 36వ రైతు మహాసభలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాద విధానానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 1936 లో అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భవించిందని, నేటికి 90 ఏళ్లు పూర్తయిందని గుర్తు చేశారు.
భూమికోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాటం చేసిన పురిటి గడ్డ నల్లగొండ జిల్లా లో మొదటిసారి జరుగుతున్న అఖిల భారత రైతు మహాసభలను జయప్రదం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. వర్షాలు లేక పత్తి వరి పంటలు ఎండిపోయి పెట్టుబడి వెళ్ళక రైతులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం రైతులకు అండగా ఉండాలని కోరారు. రైతులు బ్యాంకులో రుణాలు తీసుకొని పెట్టుబడి కట్టలేని పరిస్థితి ఏర్పడిందని, రైతులు తీసుకున్న బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు రామలింగ చారి, వడ్డే మల్లయ్య, రాంబాబు, వడ్డీ నరసింహ, మాదగొని నరసింహ, హోటల్ జంగయ్య, మీసేవ హనుమంతు, తుప్పరి యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)