Magazines

గ్రామాలభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌

1 గంట క్రితం

mla
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం


adilabad
నవతెలంగాణ-కుభీర్
ముధోల్ నియోజకవర్గంలో ఉన్న గ్రామాలను అభివృద్ధి పరచడమే తను లక్ష్యంగా పనిచేస్తున్ననాని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం మండలంలోని దార్ కుభీర్, బెల్గం గ్రామాల్లో పాలు అభివృద్ది పనులకు మండల నాయకులతో కలసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా దార్ కుభీర్ లో మహిళ సమైక్య నూతన భవనం, గోదాంల నిర్మాణాం అదే విదంగా బెల్గం గ్రామంలో అంగన్వాడీ కేంద్రం, మహిళా సమీక్య భవనం, గోదాం తదితర పనులకు భూమి పూజ చేశారు.


అక్కడ ఏర్పాటు చేసిన సమావేశం లో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ది చేయడమే తన లక్ష్యమని తెలిపారు. దింతో గ్రామస్తులు ఎమ్మెల్యేను శాలవా పూలమాలతో సన్మానించారు. అనంతరం గ్రామాలలో ఉన్న ప్రధాన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా దారుకుబీర్ గ్రామం నుంచి బెల్గాంరోడ్డు పూర్తిగా దెబ్బతిండనీ, దీంతో తరచూ జరుగుతున్నాయని, రోడ్డు బాగు చేసి బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరారు. గ్రామాల్లో ఉన్న రైతులకు రెండు పంటలకు అవసరమైన నీళ్లు అందించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.

గ్రామస్తుల కోరిక మేరకు ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. దింతో పాటు గ్రామాల్లో ఉన్న విద్యుత్ స్తంబాలు, సీసీ రోడ్లు, మురికి కాలువల, అదే విదంగా భూగర్భ జలాలు పెంపోదించేందుకు వి బి జి రామ్ జి పథకం ద్వారా ఇంకుడు గుంతల నిర్మాణం కావాలన్నది నిరంతరం ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని గ్రామస్తులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచులు, తోకల మారుతీ, గౌవర్ధన్, మాజీ ఎంపీపీ నగేష్, విఠల్, శంకర్, సాయినాథ్, మండల నాయకులు మహిళా సంఘ సభ్యులు ఆయా గ్రామాల సర్పంచులు మాజీ ఎంపీటీసీ లు తదితరులు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్