నవతెలంగాణ-మల్హర్ రావు
గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పోషకాహారం తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని మండల కేంద్రమైన తాడిచెర్లలోని అంగన్ వాడి సెంటర్-5,7 టీచర్లు అరుణ, జయప్రద అన్నారు. పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా సిడిపిఓ రాధిక,సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి ఆదేశాలతో అంగన్ వాడి కేంద్రంలో మంగళవారం పోషణ మాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాలను ప్రదర్శించి పోషకాహారంపై అవగాహణ కల్పించారు. తల్లి మంచి ఆహారం తీసుకుంటేనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)