మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
నవతెలంగాణ-మల్హర్ రావు
అధికారం కోసం ఇచ్చిన హమీలను అమలు చేయాలని అడిగితే అక్రమ కేసులు పెట్టించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని,ఇది సరికాదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. మంగళవారం పలు కేసులపై మంథని కోర్టులో నాయకులు,కార్యకర్తలతో హజరైన ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారంటీలు, 420హమీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్నారు. హమీలు అమలు చేయాలని కోరితే అక్రమంగా కేసులు పెట్టిస్తూ ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారన్నారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని, ఇందుకు తమపై నమోదైన అక్రమ కేసులే నిదర్శనమన్నారు. మూడేళ్ల ప్రజాపాలనలో ప్రజలకు తీరని అన్యాయమే జరుగుతుందని, ప్రశ్నించేవారి నోరు మూయించేలా పోలీసులను అడ్డం పెట్టుకుని భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఎంత ఇబ్బంది పెట్టినా ప్రజల పక్షాన మానీఫెస్టోలోని హమీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని ఆయన ఈ సందర్భంగా స్పష్టంచేశారు.






కామెంట్‌లు (0)