నవతెలంగాణ-మల్హర్ రావు
కాటారం మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ పాఠశాలలో డిటి ఎఫ్ కాటారం మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాటారం డిటిఏప్ మండల శాఖ పక్షాన 8 వీధిలైట్లను ప్రధానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఆవరణ సమీపంలో సుమారు 2500 నుండి 3000 వరకు విద్యార్థిని విద్యార్థులు చదువుతున్నారు. సుమారు 60 నుండి 70 మంది వరకు ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్, ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్, కేజీబీవీ, జెడ్ పి హెచ్ ఎస్ కాటారం, ఎంపీపీ ఎస్ కాటారంలలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. రాత్రి సమయంలో ఈ పాఠశాలల ఆవరణ నుండి వెళ్లే రోడ్డులో వీధిలైట్లు లేకపోవడం మూలంగా రాత్రి సమయాల్లో విధులు ముగించుకుని వచ్చే వారికి కుక్కల బెడదతో పాటు తేలు పాములు కూడా వస్తున్నాయి. దీని మూలంగా విద్యార్థిని విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు చాలా భయం భయంగా పనిచేస్తున్నారు.
దీనిని గమనించిన మండల శాఖ జిల్లా శాఖ సహకారంతో ఒక దాత (పేరు చెప్పడానికి ఇష్టపడని) ద్వారా 8 వీధిలైట్లు ప్రధానం చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ డిటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం వృత్తి పట్ల అంకితభావంతో పనిచేస్తూ సామాజిక సేవ చేయడం అభినందన నియమని వారు కొనియాడారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు మాట్లాడుతూ డిటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాటి నుంచి నేటి వరకు అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ అటు ఉపాధ్యాయులకు ఇటు విద్యార్థులకు న్యాయం చేయడం గర్వించదగ్గ విషయమని చెప్పారు.
డిటిఏప్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. తిరుపతి మాట్లాడుతూ డిటిఎఫ్ కాటారం మండల శాఖ పక్షాన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గత విద్యా సంవత్సరం వెళ్ళినప్పుడు ఉపాధ్యాయ సమస్యలతో పాటు విద్యార్థుల సమస్యలను తెలుసుకొని ఆ సమస్య పరిష్కారం దిశగా డిటి ఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేయడం మా సంఘానికి వృత్తి పట్ల నిబద్ధత సామాజిక బాధ్యతగా, సామాజిక సేవకు కట్టుబడి ఉన్నామని ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి డిటిఎఫ్ ముందుంటుందని వారి పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ సడవలి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల సమ్మయ్య, మహాదేవపూర్ సింగిల్ విండో చైర్మన్ చల్ల తిరుపతి, కాటారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, డి టి ఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్లు లక్ష్మణ్ నాయక్, ప్రభాకర్ రెడ్డి, డి టి ఎఫ్ పూర్వ జిల్లా అధ్యక్షులు జె. కరుణాకర్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు బి తిరుపతిరెడ్డి లు పాల్గొనగా ఈ కార్యక్రమానికి డి టి ఎఫ్ మండల అధ్యక్షులు రాజు నాయక్ మండల ప్రధాన కార్యదర్శి మోహన్ లు అధ్యక్షత వహించారు.






కామెంట్‌లు (0)