Magazines

మహిళా ఎమ్మెల్యేల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించాలి: హైకోర్టు

59 నిమిషాల క్రితం

ktr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ఎమ్మెల్యేల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించాలని సూచించింది. ఈ మేరకు డీజీపీని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పోలీసులపై చర్యలకు రిపోర్ట్‌ను స్పీకర్ ముందు ఉంచాలని డీజీపీకి ఆదేశాలు జారీ అయ్యాయి. స్పీకర్ ఆదేశం మేరకే పోలీసులు వ్యవహరించి ఉంటే.. అది స్పీకర్ అధికార పరిధిలోకి వస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.


మహిళా ఎమ్మెల్యేలు పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. అసెంబ్లీ నిబంధనలు ఉల్లంఘిస్తే.. స్పీకర్‌కు మాత్రమే చర్యలు తీసుకునే అధికారం ఉందని తెలిపింది. స్పీకర్ ఉత్తర్వులను మార్చేందుకు కారణాలు కనిపించడం లేదని పేర్కొంది. ఈ ఘటన అసెంబ్లీ బయట గానీ, గేటు దగ్గర గానీ జరిగి ఉంటే రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించాలని తెలిపింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్