Magazines

పిఆర్టియు టిఎస్ మండల శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక

44 నిమిషాల క్రితం

prtu
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - మల్హర్ రావు

పిఆర్టియు టిఎస్ మండల శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు ఘనంగా నిర్వహించమని జిల్లా అధ్యక్షులు రేగురి సుభాకర్ రెడ్డి,జిల్లా కార్యదర్శి కుసుమ కిరణ్ కుమార్ తెలిపారు. మండల అధ్యక్షుడుగా పాకాల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గజాడి మహేష్, అసోసియేట్ అధ్యక్షులుగా మహేందర్, గీత, ఉపాధ్యక్షులుగా మహిపాల్, శైలజ, కార్యదర్శులుగా సాంబయ్య, శాంతిలత ఎన్నికయ్యారు.


ఎన్నికల పరిశీలకులుగా సురేష్ వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల కార్యవర్గ సభ్యులకు జిల్లా, రాష్ట్ర నాయకులు అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణకు, సంఘం బలోపేతానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్