తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి
నవతెలంగాణ - మల్హర్ రావు
తాడిచెర్ల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి వినయ్ భాస్కర్ రోగులకు అందిస్తోన్న సేవలు భేష్ ని తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి అన్నారు. మంగళవారం వైద్యాధికారితో కలిసి ఆరోగ్య కేంద్రాన్ని సందర్షించారు. ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందుతున్న సేవలపై ఆరాతీశారు. వైరల్ జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రతిరోజు 150 నుంచి 200 మంది ఓపిని చేస్తున్నట్లుగా, 50 నుంచి 100 మందికి రక్త నమూనాలు సేకరిస్తున్నట్లుగా వైద్యాధికారి సర్పంచ్ కి వివరించారు. ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్టులు, అదనపు బెడ్స్ సమస్యలు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు దృష్టికి తీసుకపోతానని సర్పంచ్ తెలిపారు.






కామెంట్‌లు (0)