Magazines

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫించన్ : ఎంపీఈఓ

42 నిమిషాల క్రితం

Pension
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - అశ్వారావుపేట 

అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఫించన్ మంజూరు అవుతుంది అని ఎంపీఈఓ రామ కోటా రెడ్డి అన్నారు. మండల పరిధిలోని నారంవారిగూడెం పంచాయతీ లో పింఛను కోసం దరఖాస్తు చేసిన వ్యక్తులను మంగళవారం ఆయన పరిశీలించారు. స్థానిక సర్పంచ్ మనుగొండ నాగమణి అధ్యక్షతన ఆయన దరఖాస్తు లను తనిఖీ చేసారు. ఇప్పటికే ఈ పంచాయతీ లో 257 మంది పింఛను దారులు ఉన్నారు అని, కొత్తగా మరో 50 మంది పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నారు అని వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నార్లపాటి జగదీష్, స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్