నవతెలంగాణ-ఆలేరు రూరల్
ఆలేరు మండలంలో 16వ విడత సామాజిక తనిఖీలో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన ఉపాధి హామీ పనులపై ప్రజా వేదిక నిర్వహించారు.మండలంలోని వివిధ గ్రామాల్లో చేపట్టిన 355 పనులకు రూ.3,63,95,815 నిధులు వెచ్చించగా,సామాజిక తనిఖీ బృందం సెప్టెంబర్ 17 నుంచి 28 వరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి,అనంతరం గ్రామసభలు చేపట్టింది.
మంగళవారం ఆలేరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వేదికలో తనిఖీ నివేదికను సమీక్షించారు.
వివిధ విభాగాల్లో గుర్తించిన అవకతవకలకు సంబంధించి మొత్తం రూ.12,103 రికవరీకి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో ఏఈపీకి రూ.1,878, టెక్నికల్ అసిస్టెంట్లకు రూ.4,000, కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.921,పంచాయతీ కార్యదర్శులకు రూ.2,129, ఫీల్డ్ అసిస్టెంట్‌కు రూ.3,175 రికవరీ చేయాలని నిర్ణయించారు.కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ జి.సురేష్, ఏవీఓ మందడి ఉపేందర్‌రెడ్డి,ఏవీఎం ఆర్.ఆదిత్యవర్ధన్,ఎంపీడీఓ సత్యాంజనేయ ప్రసాద్,ఎంపీఓ అనురాధదేవి,ఎస్టీఎం తిరుపతి, ఎస్ఆర్పీ వెంకన్న,ఏపీఓ ఎన్.అరుణకుమారి, టెక్నికల్ అసిస్టెంట్లు వై.రామచంద్రయ్యచారి, ఎం.మానస,కంప్యూటర్ ఆపరేటర్లు లక్ష్మీ స్వరాజ్యం,సరళ,వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు,ఫీల్డ్ అసిస్టెంట్లు,కూలీలు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)