Magazines

పిఏసిఎస్ చైర్మన్ మొండయ్యకు ఘన సత్కారం

52 నిమిషాల క్రితం

ippa Mondaiah
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

ఐపీఎం రైతు మార్గదర్శక పుస్తకావిష్కరణ సభలో

నవతెలంగాణ-మల్హర్ రావు

విల్సన్ అగ్రి సైన్స్ సంస్థ ఆధ్వర్యంలో హన్మకొండలోని టీచర్స్ కాలనీలో సోమవారం నిర్వహించిన ఐపీఎం ఫార్మర్ గైడ్ 2026-27 పుస్తకావిష్కరణ వేడుకలో తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్, ప్రగతిశీల రైతు ఇప్ప మొండయ్యను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సమగ్ర కీటక యాజమాన్యం (ఐపీఎం) విధానాలను పాటిస్తూ,సుస్థిర వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్నందుకు ఆయనను ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బి.ఎ.ఎస్.ఎఫ్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధి డాక్టర్ సంజయ్ థక్కర్, విల్సన్ అగ్రి సైన్స్ నిర్వాహకులతో కలిసి శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా పిఏసిఏస్ చైర్మన్ మాట్లాడారు. రైతులు ఆధునిక, పర్యావరణ అనుకూల సాంకేతిక పద్ధతులను అలవర్చుకుని నాణ్యమైన దిగుబడులు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కంపెనీల జోనల్ మేనేజర్లు అధికారులు,రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్