Magazines

తాళం వేసిన ఇంట్లో చోరీ

55 నిమిషాల క్రితం

avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-నవాబు పేట

మండల పరిధిలోని కూతురు గ్రామంలో తాళం వేసిన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో బంగారు నగలు దొంగిలించినట్లు బాధితులు సోమవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటన సంబంధించిన వివరాలు ప్రకారం కూచిపూడి గ్రామానికి చెందిన గడ్డం శివ శంకరయ్య అతని భార్య ఇద్దరు కలిసి వ్యవసాయ పొలంలో పని ఉందని ఇంటికి తాళం చేసి కిటికీ పక్కన పెట్టి వెళ్లారు తిరిగి సాయంత్రం 5:30 కు వచ్చి ఇంట్లో వెళ్లి చూడగా బీరువా చూడగా అందులో ఉన్న బంగారు కమ్మలు బంగారు ముక్కుపుడక దాదాపు 15 మాసాలకు పైగా ఉన్న బంగారం దొంగిలించినట్లు గుర్తించారు.

చుట్టుపక్కల వారిని ఆరా తీయగా ఎవరు సమాచారం ఇవ్వకపోవడంతో అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు పడమటి కుమార్ ఇప్ప పవన్ లపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకోవాలని ఎస్సై నరేందర్ ను ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్