నవతెలంగాణ - హైదరాబాద్ : మహారాష్ట్రలోని హింగోలి, నాందేడ్ జిల్లాల్లో శనివారం ఉదయం స్వల్ప భూకంప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఉదయం 7:46 గంటలకు ఔంధా నాగ్‌నాథ్ తాలూకాలోని గధాలా ప్రాంతంలో ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 3.3గా నమోదైనట్లు హింగోలి జిల్లా విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ప్రకంపనలతో స్థానికులు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. అయితే తీవ్రత తక్కువగా ఉండటంతో ఇప్పటివరకు ఎలాంటి భారీ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
మహారాష్ట్రలో స్వల్ప భూకంపం.. 3.3 తీవ్రత
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)