Magazines

నెలాఖరు నుంచి జంతర్‌మంతర్‌లో ఆందోళన : దీప్కే

59 నిమిషాల క్రితం

Jantar Mantar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెలాఖరు నుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ఆందోళన చేపడతామని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ప్రకటించారు. గురువారం ముంబయిలో మీడియాతో మాట్లాడుతూ, సీఈసీ రాజీనామా చేసే వరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అక్టోబర్‌ 2న ముంబయిలోని శివాజీ పార్క్‌లో నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు.


గోవా, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లోనూ ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పారు. సీఈసీ నియామక ప్రక్రియలో పౌర సమాజానికి భాగస్వామ్యం కల్పించాలని, నియామకాల్లో పారదర్శకత పాటించాలని డిమాండ్‌ చేశారు. 2025 ఓటర్ల జాబితాను స్తంభింపజేసి, దానిలో ఇకపై ఎలాంటి మార్పులూ చేయరాదని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్