Magazines

హైజంప్‌లో రజతం.. గోల్డ్‌ జస్ట్‌ మిస్‌

1 గంట క్రితం

Silver in high jump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో పురుషుల హైజంప్‌లో భారత్‌కు రజత పతకం లభించింది. భారత అథ్లెట్‌ సర్వేశ్‌ కుషారే 2.25 మీటర్ల ఎత్తుకు జంప్‌ చేసి సిల్వర్‌ మెడల్‌ సొంతం చేసుకున్నాడు. తైవాన్‌కు చెందిన చావో సువాన్‌ ఫు కూడా ఇదే ఎత్తుకు జంప్‌ చేశాడు. కానీ మొదటి ప్రయత్నంలోనే అతడు సాధించడంతో స్వర్ణం వరించింది. మరో వైపు మహిళల 3వేల మీటర్ల స్టీపుల్‌ చేజ్‌ ఈవెంట్‌లో భారత అథ్లెట్ పారుల్‌ చౌదరీ, మెన్స్‌ డెకథ్లాన్‌లో తేజస్విన్‌ శంకర్‌ కాంస్య పతకాలు సాధించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్