నవతెలంగాణ - హైదరాబాద్ : ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన మాన్వితా రెడ్డి (27) క్యాన్సర్‌తో పోరాడి మృతి చెందారు. దాదాపు రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మాన్విత మూడేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. ప్రస్తుతం మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లో నివాసం ఉంటున్నారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.






కామెంట్‌లు (0)