Monday, June 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ గృహ ప్రవేశాన్ని ప్రారంభించిన సర్పంచ్

ఇందిరమ్మ గృహ ప్రవేశాన్ని ప్రారంభించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని పెద్ద గుల్లా తాండాలో ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరై నిర్మాణాలను పూర్తి చేసుకున్న గృహాన్ని సర్పంచ్ సుమతి యశ్పాల్ రాథోడ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామానికి మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రతిరోజూ పరిశీలించామని అన్నారు. లబ్దిదారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ..నిర్మాణాలను వేగంగా పూర్తయ్యేందుకు తమవంతు సహకారం అందించామని తెలిపారు. ఈ క్రమంలో సోమవారం ఇందిరమ్మ గృహ ప్రవేశాలను ప్రారంభించామని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్, జిపి కార్యదర్శి, జిపిఓ, జిపి కార్యవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -