Monday, June 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏఎస్ఓ కు ఘన వీడ్కోలు

ఏఎస్ఓ కు ఘన వీడ్కోలు

- Advertisement -

నవతెలంగాణ – తిమ్మాజిపేట
మండల కేంద్రంలో ఉన్న మద్యం గోదాంలో గత ఐదు సంవత్సరాలుగా ఏఎస్ఓ గా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న శివకుమార్ కు తోటి సిబ్బంది సోమవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో డిపో మేనేజర్, ఎక్సైజ్ సిబ్బంది హమాలీలు, ట్రాన్స్ పోటర్లు పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ శ్రీధర్ శివకుమార్ కు ఘనంగా సన్మానించి మాట్లాడుతూ.. మద్యం గోదాంలో నిబద్ధతతో విధులు నిర్వహించి అందరి మన్ననలు పొందారని అన్నారు. బదిలీపై వెళ్తున్న అక్కడ కూడా ఇలాగే విధులు నిర్వహించి అందరి ఆదరాభిమానాలు పొంది భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకొని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై బాలేశ్వరి ఏఎస్ఓ మధు ఎక్సైజ్ కానిస్టేబుల్ బాలయ్య కంప్యూటర్ ఆపరేటర్ వేణు హమాలీ నాయకులు గురువయ్య, జీవన్, నాగయ్య, పెద్దిరెడ్డి, ఆంజనేయులు, వెంకటయ్య, వినయ్, చంద్రశేఖర్, తదితరులు వున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -