నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పలు గ్రామాలలో జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్వహిస్తున్న పనులను జోరందుకున్నాయని ఆయా గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని లొంగన్ జీపీ గ్రామంలో ఎంపీ ఓ రాము మరియు జుక్కల్ మండల కేంద్రంలో ఎంపీడీవో శ్రీనివాస్ ఫీడర్ ఛానల్ పనులను ఆయా గ్రామాల సర్పంచ్లైన నాగలగిద్దే ఉషారాణి, కర్రేవార్ వార్ సావిత్రి సాయ గౌడ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో , ఎంపీ ఓ మాట్లాడుతూ ఎండలు ఎక్కువైనా గ్రామీణ ప్రాంతాలలో పనులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అలాంటి వారు తప్పకుంగా జాతీయ ఉపాధి హామీ పనులను ఉపయోగించుకోవాలని సూచించారు. లుంగన్ గ్రామంలో ఫీడర్ పనులు చేయడం వలన గ్రామానికి వర్షపు నీరు రోడ్లకు అడ్డంగా పోకుండా.. పంట పొలాలు నష్టం జరగకుండా.. నేరుగా చెరువులకి నీరు వెళ్లాయని చెప్పారు. జుక్కల్ మండల కేంద్రంలోని నర్సరీతో పాటు పనులు జరుగుతున్న ప్రదేశాన్ని పరిశీలించి కూలీల హాజరు తీసుకున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మరియు ఎంపీవో ఆయా గ్రామాల గ్రామ సర్పంచులు , ఉప సర్పంచ్ లు, జిపి కార్యదర్శిలు, జిపిఓ లు, జిపి కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామాలలో జోరందుకున్న ఉపాధి పనులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



