నవతెలంగాణ – బోనకల్
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోనే బోనకల్ మండల తహసిల్దార్ చల్లూరి సుధాకర్ సోమవారం అధికార బాధ్యతలను స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో స్వీకరించారు. గతంలో బోనకల్ తహసిల్దార్ గా విధులు నిర్వహించిన మద్దెల రమాదేవి నల్లగొండ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో కామేపల్లిలో తహసిల్దారుగా విధులు నిర్వహిస్తున్న చల్లూరి సుధాకర్ బోనకల్ తహసీల్దారుగా బదిలీ అయ్యారు. నూతన తహసిల్దార్ చల్లూరి సుధాకర్ కు నాయబ్ తాసిల్దార్ అజ్మీర లక్ష్మణ్, గిర్దావర్ జంగంగూడెం మైథిలి, కార్యాలయ సిబ్బంది, పలువురు గ్రామ పరిపాలన అధికారులు తదితరులు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన తహసిల్దార్ సుధాకర్ విలేకరులతో మాట్లాడుతూ కామేపల్లి మండలంలో రెండున్నర సంవత్సరాల పాటు ప్రజలకు సేవలు అందించానని, అదే స్థాయిలో బోనకల్ మండలంలో కూడా పనిచేస్తానని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం తహసిల్దార్ కార్యాలయముకు వచ్చే ప్రజలు, రైతుల, విద్యార్థుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కారం చేస్తానని తెలిపారు. మండల ప్రజలకు సంపూర్ణంగా సేవలు అందించటమే తన లక్ష్యం అన్నారు. మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు సహకరించాలని ఆయన కోరారు.



