నవతెలంగాణ-ఆలేరు రూరల్
ఆలేరు మండలం కొల్లూరు గ్రామ పాల ఉత్పత్తిదారుల సంఘం (మదర్ డైరీ) నూతన చైర్మన్‌గా ఐలి కృష్ణగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.సోమవారం కొల్లూరు పాల సంఘ భవనంలో జరిగిన సంఘ డైరెక్టర్ల సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించగా డైరెక్టర్లు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతన చైర్మన్ ఐలి కృష్ణగౌడ్ మాట్లాడుతూ సంఘ అభివృద్ధితో పాటు పాడి రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.పాల ఉత్పత్తిదారుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ,సంఘాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పనిచేస్తానన్నారు.తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో సహకరించిన సంఘ డైరెక్టర్లకు,పాడి రైతులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికతో సంఘ కార్యకలాపాలు మరింత చురుకుగా సాగి,పాడి రైతులకు మెరుగైన సేవలు అందుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.
మదర్ డైరీ చైర్మన్‌గా ఐలి కృష్ణగౌడ్ ఏకగ్రీవ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


