Monday, June 1, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్నిరుద్యోగులకు శుభవార్త..TGPSC కీలక ప్రకటన

నిరుద్యోగులకు శుభవార్త..TGPSC కీలక ప్రకటన

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీపికబురు చెప్పింది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తూ కీలక ప్రకటన చేసింది. రేపు ఒకేసారి 3 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లుగా TGPSC చైర్మన్‌ బుర్ర వెంకటేశం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతుందని, ఈ నెలలో మరిన్ని ఎక్కువ నోటిఫికేషన్లను వరుసగా విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 3,800 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు.

రాబోయే నోటిఫికేషన్లలో అటవీ శాఖకు అగ్రభాగం దక్కనుంది. ఆ శాఖలో ఖాళీగా ఉన్న 3,093 పోస్టులను భర్తీ చేయనున్నట్లుగా టీజీపీఎస్సీ బుర్ర వెంకటేశం తెలిపారు. వాటితో పాటు వివిధ శాఖల్లో కేవలం ఒకే ఒక్క ఖాళీ ఉన్న సుమారు 25 సింగిల్ పోస్ట్ ఖాళీలను కూడా భర్తీ చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. భవిష్యత్తులో రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో భారీ సంస్కరణలు తీసుకొస్తున్నామని, ఇకపై జరగబోయే పరీక్షలన్నీ పారదర్శకంగా, లీకేజీలకు తావు లేకుండా పూర్తి స్థాయిలో కంప్యూటర్ విధానంలోనే నిర్వహించనున్నామని స్పష్టం చేశారు. కేంద్రంలో యూపీఎస్సీ అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాల తరహాలోనే తెలంగాణలో కూడా పరీక్షల నిర్వహణకు ‘ప్రతిభా భారతి’ అనే సరికొత్త పద్ధతిని తీసుకురానున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం వెల్లడించారు. తాజా ప్రకటనతో నోటిఫికేషన్ల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -