Monday, June 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్నూర్‌లో కేంద్ర విద్యాలయ పనులు వెంటనే ప్రారంభించాలి

మద్నూర్‌లో కేంద్ర విద్యాలయ పనులు వెంటనే ప్రారంభించాలి

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం పనులు వెంటనే చేపట్టాలని యువకులు సోమవారం తహశీల్దార్ ఎండి ముజీబ్ కు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. ఈ ప్రాంత ప్రజలు, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మద్నూర్‌లో మంజూరైన కేంద్ర విద్యాలయ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించవలసిందిగా విన్నవిస్తున్నట్లు యువకులు పేర్కొన్నారు. ఈ విద్యాలయం ప్రారంభమైతే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడంతో పాటు, వారి విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై ప్రజల్లో ఎంతో ఆశాభావం ఉన్నందున సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు వేగవంతం చేయుటకు చర్యలు తీసుకోవలసిందిగా వారు తహశీల్దార్ ను కోరారు. కేంద్రీయ విద్యాలయం మంజూరైనట్లు వినడమే కానీ పనులు ప్రారంభం కావడం లేదని అంటున్నారు. సమస్య గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని తహశీల్దార్ హామీ ఇచ్చినట్లు యువకులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -