Monday, June 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ

ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ

- Advertisement -

– ప్రమాద బాధితుడికి ఆర్థిక సాయం – పాఠశాల పనుల పరిశీలన
– భూమి కోల్పోయిన బాధితునికి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ
నవతెలంగాణ – ఉప్పునుంతల

ఉప్పునుంతల మండలంలోని కొరటికల్, రాయిచేడ్ గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సోమవారం ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారుడు గొడుగు తిరుపతయ్య, గ్రామ సర్పంచ్ తోళ్ల లలిత ఆనంద్, డిప్యూటీ సర్పంచ్ గోరటి విజయ ప్రవీణ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను అభినందించిన ఎమ్మెల్యే, పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

అదే విధంగా మామిళ్లపల్లి గ్రామంలో సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించగా ఉప్పునుంతలలో గ్రామ సర్పంచి, పంచాయతీ కార్యదర్శి, వెల్టూరు గ్రామంలో గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాయిచేడ్ గ్రామంలో ఇటీవల ప్రమాదానికి గురైన బోడ మల్లయ్యను ఎమ్మెల్యే పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

తదుపరి రాయిచేడ్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న నూతన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను పరిశీలించారు. నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కట్ట అనంతరెడ్డి, మాజీ జెడ్పీటీసీ అనంత ప్రతాప్ రెడ్డి, అయ్యవారిపల్లి గ్రామ సర్పంచ్ జిల్లెల్ల జగత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రఘుపతి రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ రాత్లావత్ కృష్ణ, ఎంపీడీవో వరుణ్ తేజ్, హౌసింగ్ ఏఈ, ఎంపీఓ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత
రాయిచేడ్ గ్రామానికి చెందిన రైతు ఇంజమూరి ఆంజనేయులు తన లావణి పట్టా భూమిలోని సర్వే నంబర్ 61లో గల ఒక ఎకరం భూమి నూతన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణంలో కోల్పోయినట్లు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని రైతుకు హామీ ఇచ్చాడు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -