Monday, June 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: మంత్రి శ్రీధర్ బాబు

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో కాటారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, డీఎఫ్‌ఓ నవీన్ రెడ్డి మొక్కలు నాటారు.

అనంతరం  ప్రజలు ఇండ్లలో పండ్ల మొక్కలు నాటేందుకు పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని కోరారు. చెట్లు తగ్గిపోవడం వల్ల వాతావరణంలో పెను మార్పులు వస్తున్నాయని, ఓజోన్ పొర దెబ్బతిని వాతావరణంలో వేడి పెరుగుతుందని తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ద్వారా గ్రామాలు మరియు పట్టణాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ రాజాబాబు, అటవీశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు,  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -