నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల గ్రామానికి చెందిన నడిగడ్డ యాదగిరి ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని వెల్‌నెస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఉప్పునుంతల త్రివేణి ఎలక్ట్రిషన్, ప్లంబర్ సంఘం సభ్యులు మానవత్వం చాటుకున్నారు. సంఘీభావం వ్యక్తం చేస్తూ యాదగిరికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ, కష్టకాలంలో తోటి కార్మికులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అవసరమైన సమయంలో పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యాదగిరి త్వరగా కోలుకుని తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పి. బాలరామ్, ఎస్. కుర్మయ్య, బి. పర్వతాలు, పి. నిరంజన్, పి. కొండల్, ఎస్. బాలకృష్ణ, పి. లింగస్వామి, ఎం. శేఖర్, బి. మహేష్, బి. వెంకటయ్య, ఎస్. మహేష్, సి. మల్లేష్, బి. స్వామి, బి. మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.



