Saturday, June 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సినీ కవి మౌనశ్రీ మల్లిక్ కు యస్.పి.బాలు పురస్కార ప్రదానం

సినీ కవి మౌనశ్రీ మల్లిక్ కు యస్.పి.బాలు పురస్కార ప్రదానం

- Advertisement -

సుబ్రహ్మణ్యం 80వ జయంతి వేడుకలు
ముఖ్య అతిథిగా లీడర్ పత్రికాధిపతి రైటర్స్ అకాడమీ చైర్మన్ వి.వి.రమణమూర్తి
నవతెలంగాణ – హైదరాబాద్:
ధర్మపురి కృష్ణమూర్తి సాంస్కృతిక సేవా సంస్థ, విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథాలయంలో ” ఆమనీ పాడవే హాయిగా” ” బాలు పాట – త్యాగరాజు నోట” పేరిట గాన గంధర్వులు, పద్మవిభూషణ్ డా.ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, 80వ జయంతి వేడుక సంగీత అభిమానులు, పట్టణ ప్రముఖుల మధ్య కడు వైభవంగా జరిగింది. మొదట రచయిత మేడా మస్తాన్ రెడ్డి స్వాగతోపన్యాసము చేసి, అతిథులను వేదికపైకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమ నిర్వాహకులు ధర్మపురి త్యాగరాజు, తన బృందంతో కలిసి, యస్.పి.బాల సుబ్రహ్మణ్యం పాడిన సినిమా గీతాలను పాడి కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. ధర్మపురి త్యాగరాజు ను గాయకుల బృందం ఘనంగా సన్మానించింది. ఈ సభలో ప్రముఖ సినీ, టీవీ గీత రచయిత మౌనశ్రీ మల్లిక్ కు ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం పురస్కారాన్ని అందజేసి, అతనిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లీడర్ పత్రికాధిపతి, రైటర్స్ అకాడమీ చైర్మన్ వి.వి.రమణమూర్తి హాజరై, కార్యక్రమం వీనులవిందుగా ఉందని, మల్లిక్ ను సన్మానించడం విశాఖపట్నానికే గర్వకారణమని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఘంటసాల, బాలు ఇద్దరు పేదరికం నుంచి వచ్చిన వారేనని, వారు ఏ విధంగా ప్రగతి సాధించారో వివరించారు. ఘంటసాల తర్వాత బాలు ఉన్నారని, బాలు తర్వాత అలాంటి గాయకులు మరలా లేరని, ఇలాంటి కార్యక్రమాన్ని రూపొందించినందుకు ధర్మపురి త్యాగరాజును అభినందించారు. అదేవిధంగా గాయనీ మణులను ప్రత్యేకంగా కొనియాడారు. విశిష్ట అతిథులైన కన్వీనర్, మెలోడీ క్రియేటర్స్, బాలు విగ్రహ ప్రతిష్టాపకులు కడలి వీరాస్వామి, కవి, గేయ రచయిత స్వరకర్త తాళాభక్తుల లక్ష్మీప్రసాద్, ఆధ్యాత్మిక వేత్త ఫణి స్వామి, కళా పోషకులు కొణతాల రాజు
కవి కథా నవలా రచయిత విశాఖ రచయితల సంఘం అధ్యక్షులు అడపా రామకృష్ణ, విశాఖ సంస్కృతి మాస పత్రిక సంపాదకులు శీరేల సన్యాసిరావు లు, పురస్కార గ్రహీత మౌనశ్రీ మల్లిక్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మౌనశ్రీ మల్లిక్ స్పందిస్తూ, తనను పురస్కారం అందజేసిందుకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రూపు కల్పన చేసిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. కళాకారులకు హృదయ సంస్కారం ఉంటుందని, ధర్మపురి త్యాగరాజు అలాంటి వారని, ప్రశంసించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -