మహబూబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదవ రెడ్డి
నవతెలంగాణ-నెల్లికుదురు
మహబూబాద్ ప్రస్తుత ఎంపీ, మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదెళ్ల యాదవ రెడ్డి, మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు, మండల శాఖ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ తెలిపారు. జన్మదిన వేడుకను పురస్కరించుకొని మండల కేంద్రంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని పేదలకు పండ్లను పంపిణీ చేసిన అనంతరం స్థానిక పీహెచ్సీలో రోగులకు కూడా పండ్లను పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ ఈ మహబూబాద్ పార్లమెంటు పరిధిలో అనేక కోట్లధిరూపాయల నిధులు తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేసిన వ్యక్తి అని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి జన్మదిన వేడుకను ఈ నెల్లికుదురు మండల కేంద్రంలో నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు స్థానిక సర్పంచ్ పులి వెంకన్నతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, ఆ పార్టీ జిల్లా మండల గ్రామ నాయకులు, అభిమాన సంఘాలు మహిళలు పాల్గొన్నారు.



