ఏపీఎం నరేంద్ర కుమార్
నవతెలంగాణ – నెల్లికుదరు
ప్రతి డ్వాక్రా మహిళ ఉన్నంత స్థాయికి ఎదగాలని ఎఫ్పిసిసి ఈ ఓ రమేష్, ఏపీఎం నరేంద్ర కుమార్ అన్నాడు. మండల కేంద్రంలోని మహిళా ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ సర్వసభ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 25 వ సంవత్సర లావాదేవీలను ఈ సమావేశంలో చదివి వినిపిస్తున్నట్లు తెలిపారు. జరగబోయే ప్రణాళిక కార్యక్రమాలను తయారు చేసుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఈ మండలానికి ఎఫ్ పి సి కంపెనీ ద్వారా 100 మెట్రిక్ టన్నుల గోడౌన్ కూడా మంజూరు అయింది అని అన్నారు . వివిధ రకాల పంటల మార్పిడిపై ఏ విధంగా దిగుమతి ఎక్కువ వస్తుంది అనే అంశాలపై వివరించండి చెప్పారు. పసుపు మిర్చి పంటలు వేసిన రైతుల వద్దకు వెళ్లి కొనుగోలు చేసి ఎఫ్ పి సి సంబంధించిన కంపెనీతో మనం మాట్లాడుకుని కొనుగోలు చేసినట్లయితే మహిళ ఎంతో ఆర్థికంగా ఎదుగుతుందని అన్నారు అనంతరం
నూతన కమిటీ ఎన్నిక
చైర్మన్గా నాయిని కోమలత వైస్ చైర్మన్ గా లక్కాకుల కల్పన ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ అధ్యక్షురాలు పి సునీత కార్యదర్శి ఆరిఫా కోశాధికారి ఎం రజిత సంస్థ కోఆర్డినేటర్ లాలు వివిధ గ్రామాల ఎఫ్ పి సి గ్రూపుల మహిళలు పాల్గొన్నారు.



