నవతెలంగాణ – పరకాల
పరకాల పురపాలక సంఘం పరిధిలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా వివిధ వార్డులలో సభలను ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీలోని 1, 2, 9, 11 మరియు 13వ వార్డులలో జరిగిన ఈ సభలలో అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలతో ముఖాముఖి చర్చలు జరిపారు. స్థానిక సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు, వార్డుల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో ప్రజల నుండి అనేక సూచనలను, వినతులను అధికారులు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్ మాట్లాడుతూ.. వార్డులలో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా మరియు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు దుబాసీ వెంకటస్వామి, బొచ్చు శ్యామల బాబురావు, బెజ్జంకి పూర్ణ చారి,గుడెల్లి సదన్ కుమార్,మతి బొచ్చు మాధవి లత, మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రంజి వెంకట్ రెడ్డి, వార్డు అధికారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
పరకాల మున్సిపాలిటీలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ వార్డు సభలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



