- Advertisement -
– ఊరూరా గ్రామ సభలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రత్యేక గ్రామసభల్లో పర్యావరణ పరిరరక్షణే ధ్యేయంగా కార్యాచరణ చేపడుతున్నారు. శనివారం మండలంలోని పాతల్లిగూడెం,అచ్యుతాపురం,కన్నాయిగూడెం,కొత్తమామిళ్ళవారిగూడెం,ఊట్లపల్లి పంచాయితీల్లో ఎంపీడీఓ రామ కోట రెడ్డి నోడల్ అధికారిగా గ్రామసభలు నిరైవహించారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ లు కుంజా శ్రీను,సరిహద్దులు పోలయ్య,ఎస్ హెచ్ ఓ ఎస్సై యయాతి రాజు,ఏఓ పి. శ్రీనివాస్,ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -



