Wednesday, June 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవరద ముంపు ప్రాంతాల్లో ఉన్నతాధికారులు

వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నతాధికారులు

- Advertisement -

క్ష‍ేత్రస్థాయిలో పరిశీలన ..చెరువులు, కాలువల సందర్శన
వరద కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచన
సమస్య పరిష్కారంపై చర్చ
పర్యటనలో డీజీపీ, హైడ్రా కమిషనర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, సీఎంసీ కమిషనర్‌

నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌‌లో వర్షానికి వరద ముంచెత్తిన ప్రాంతాలను ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం సందర్శించింది. డీజీపీ సీవీ ఆనంద్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, సీఎంసీ కమిషనర్ సృజన, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి, ఇరిగేషన్ ఇంజినీర్లు, మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఈ పర్యటనలో ఉన్నారు. ముందుగా రాయదుర్గంలోని మల్కం చెరువును సందర్శించారు. అక్కడ సమావేశమై వరదకు గల కారణాలు, పరిష్కార చర్యలను సమీక్షిం చారు. చెరువులో వరద నీటిమట్టం తగ్గిస్తే చాలా వరకు ముంపు సమస్య పరిష్కరించొచ్చని అధికారులు చెప్పారు. చెరువు నిండా నీరుండటంతో ఇన్‌‌లెట్ల వద్ద పెద్దమొత్తంలో పూడిక పేరుకుపోయి వరద నీరు చెరువుకు చేరే అవకాశం లేకుండా పోతోందని హైడ్రా కమిషనర్ చెప్పారు. ఆ తర్వాత ఖజాగుడ చెరువు ఇన్‌‌లెట్ల వద్ద పూడికతీత పనులతోపాటు వరద నీరు చెరువులోకి చేరే విధంగా కాలువను విస్తరించే పనులను పరిశీలించారు. మాదా పూర్‌లోని దుర్గం చెరువు ఇన్‌లెట్లు, ఔట్‌లెట్ల‌ను ప‌రిశీలిం చారు. చెరువులో ఉన్న నీరు పోటెత్త‌డంతో ఇన్‌లెట్ల నుంచి వ‌చ్చే వ‌ర‌ద నీరు సాఫీగా చెరువుకు చేర‌క‌పోవ‌డాన్ని గుర్తించారు. మురుగు నీరు మాత్ర‌మే ఎస్‌టీపీల‌కు వెళ్లేలా వ‌ర‌ద నీరు నేరుగా చెరువులోకి క‌లిసే ఏర్పాట్లు స‌రిగా లేక‌పోవ‌డంతో ఇబ్బందులు త‌లెత్తుతు న్నాయ‌ని గ్ర‌హించారు. చెరువు ఔట్‌లెట్ల‌ను విస్త‌రించా ల్సిన అవ‌స‌రాన్ని గుర్తు చేశారు. విఠ‌ల్‌రావు న‌గ‌ర్‌లో ఇటీవ‌ల ఎస్ ఎన్ డీపీ అందుబాటులోకి తెచ్చిన వ‌ర‌ద కాలువ‌కు నీరు చేరనందున మునిగిన ప్రాంతాల‌ను ప‌రిశీలించారు.

అనంతరం కొండాపూర్ సంతోష్ దాబా వద్ద వరద కాలువల్లో పూడిక తీత పనులను పరిశీలించారు. మొండికుంటకు వరద నీరు సాఫీగా వెళ్లలేని పరిస్థితులు జూబ్లీ గార్డెన్స్ లో స్లాబులు తొలగించి హైడ్రా చేపట్టిన పూడికతీత పనులను సుదర్శన్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పరిశీలించారు. గురునాథ్ చెరువుకు వరద వెళ్ళే మార్గం, అనంతరం మియాపూర్‌ ‌లోని గుర్నాథ్ చెరువు ఇన్‌‌లెట్లను పరిశీలించారు. ఇన్‌‌లెట్ల కాలువను ఆక్రమించి అపార్ట్మెంట్ వాసులు ప్రహరీని నిర్మించిన తీరుతో పాటు, వరద కాలువలను మూసేసి నిర్మించిన తీరును పరిశీలించారు. ప్రహరీలు తొలగించి వరద కాలువలను హైడ్రా పునరుద్ధరించిన పనులను పరిశీలించారు. చెరువుల ఇన్‌‌లెట్లు, ఔట్‌‌లెట్లు సరిగ్గా ఉంటే వరద ముప్పు తప్పించడానికి వీలుంటుందని హైడ్రా కమిషనర్ చెప్పారు. చందానగర్‌ ‌లోని గంగారం చెరువు ఇన్‌‌లెట్లు కూడా పూడుకుపోవడంతో ప్రధాన రహదారి వరదలో మునుగుతోందని అక్కడి స్థానిక అధికారులు తెలిపారు. ప్రధాన రహదారిలో ఉన్న కాలువల పూడికతీత పనులు కష్టమైన వెంటనే క్లియర్ చేయాలని సుదర్శన్ సూచించారు. మంగళవారం ఉదయం నుంచి వరద ముంచెత్తే ప్రధాన ప్రాంతాలను చూశామని, అక్కడి సమస్యలను తొలగిస్తే చాలావరకు వరద ముప్పు నుంచి బయటప డతాయని అన్నారు. రహదారుల్లో వరద నీరు నిలిస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతాయని అన్ని విభాగాలు కలిసికట్టుగా పని చేసి వరద కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -