Wednesday, June 17, 2026
E-PAPER
Homeఆటలుటీజీ20 ప్రచారకర్తగా 
విజయ్‌ దేవరకొండ

టీజీ20 ప్రచారకర్తగా 
విజయ్‌ దేవరకొండ

- Advertisement -

టైటిల్‌ స్పాన్సర్‌‌గా శ్రీనిధి యూనివర్శిటి
నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఈ నెల 21 నుంచి ఆరంభం కానున్న టీజీ20 లీగ్‌కు ప్రచారకర్తగా సినీ నటుడు విజయ్‌ ‌దేవరకొండ వ్యవహరించనున్నారు. 21 రోజుల పాటు సాగే టీజీ20 తొలి సీజన్‌‌కు శ్రీనిధి యూనివర్శిటి టైటిల్‌ ‌స్పాన్సర్‌‌ హక్కులు దaక్కించుకుందని హెచ్‌‌సీఏ కార్యదర్శి మన్నె జీవన్‌‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రాంఛైజీ యజమానులతో కలిసి టీజీ20 గవర్నింగ్‌ ‌కౌన్సిల్‌ ‌చైర్మెన్‌ ఆగం రావు లీగ్‌ ‌వివరాలను వెల్లడించారు. ‘తెలంగాణ గ్రామీణ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు టీజీ20 లీగ్‌ ‌గొప్పగా ఉపయోగపడుతుంది. విజయ్‌‌దేవరకొండ ప్రచారకర్తగా లీగ్‌‌కు మరింత ప్రచారం లభించనుంది. ఇంపాక్ట్‌ ‌ప్లేయర్‌ ‌రూల్‌ ‌మినహా ఐపీఎల్‌ ‌రూల్స్‌ అన్నీ టీజీ20లో ఉంటాయి. విజేతకు రూ.1 కోటి, రన్నరప్‌‌కు రూ.50 లక్ష‍లు, 3,4వ స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.25 లక్ష‍ల చొప్పున నగదు బహుమతి అందిస్తామని’ ఆగం రావు తెలిపారు. ఈ నెల 21న ఉప్పల్‌ ‌స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌‌లో పాలమూరు స్ర్టయికర్స్‌, అన్విత ఖమ్మం ఏసెస్ జట్లు పోటీపడనున్నాయి. సంగీత దర్శకులు ఎస్‌ ‌తమన్‌ ఆరంభ వేడుకల్లో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా టీజీ20 తొలి సీజన్‌ ‌షెడ్యూల్‌‌ను విడుదల చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -