Wednesday, June 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మల్హర్ రావులో రేపటి నుంచి ఇంటింటికీ ‘సర్'

మల్హర్ రావులో రేపటి నుంచి ఇంటింటికీ ‘సర్’

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు : రేపటి నుంచి ఇంటింటికి సర్ (ప్రత్యేక సమగ్ర సవరణ)కార్యక్రమంలో భాగంగా బీఎలీలు వచ్చి పూర్తి స్థాయి ఓటరు వివరాలు సేకరిస్తారని తహసీల్దార్ రవికుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన తాడిచెర్ల తహశీల్దార్ కార్యాలయంలో మండలంలోని 24 పోలింగ్ కేంద్రాల బిఎల్ఓ లకు అవగాహన నిర్వహించారు.ఈ సందర్భంగా తహ సీల్దార్ మాట్లాడుతూ బీఎల్ఓలకు సర్ ప్రక్రియపై పూర్తి శిక్షణ ఇచ్చామన్నారు.అం దుకు సంబంధించిన కిట్లు సైతం ఇచ్చామని తెలిపారు. బీఎల్ఎలు ఇంటింటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫారాలు అందించి,పూర్తి వివరాలు సేకరిస్తారని తెలిపారు.ఇంటి వద్ద ఎవ్వరూ లేకపోతే, మరో రెండు సార్లు బీఎల్ ఓలు వసార్తన్నారు.సర్ ప్రక్రియతో మరణిం చిన,ఇతర ప్రదేశాలకు శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లును తొలగించనున్నట్లుగా చెప్పారు. బీఎల్ఎలు పారదర్శకంగా ఓటరు వివరాలు సేకరించాలని సూచించారు.సర్ సర్వే కోసం వచ్చే బీఎల్సీలకు ప్రతి ఒక్కరూ తమ వివరాలు అందించాలన్నారు.ఓటర్ జాబితాను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయను న్నట్లుగా చెప్పారు.2002 ఓటరు జాబితాలో పేరు ఉంటే దానికి సంబంధించి సీరియల్ నంబర్ ఇవ్వాలని ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో జిపిఓలు,పంచాయతీ కార్యదర్శులు,బిఎల్ఓ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -