Thursday, June 25, 2026
E-PAPER
Homeఖమ్మంభవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలేశారు

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని గాలికొదిలేశారు

- Advertisement -

– జూన్ 30న తహశీల్దార్ ఆఫీసుల ఎదుట ధర్నాలు
– భవన నిర్మాణ కార్మికుల సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు 
నవతెలంగాణ-సత్తుపల్లి : ​సీఎస్సీ హెల్త్ టెస్టుల పేరుతో భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు ఖజానాను ఖాళీ చేస్తూ, తప్పుడు రిపోర్టులతో కార్మికులను భయాందోళనకు గురిచేస్తున్నారని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముదాం శ్రీనివాసరావు మండిపడ్డారు. బుధవారం సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మరణించిన కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లించకుండా కాలయాపన చేస్తున్న ‘ట్రైల్ బ్లేజర్’ ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థ లీజును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల భద్రతను రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం జూన్ 30న జిల్లా వ్యాప్తంగా అన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు దోనోజు లక్ష్మణాచారి, ఉపాధ్యక్షుడు బోయినపల్లి వీరబాబు, మల్లూరు చంద్రశేఖర్, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్రావు, జిల్లా కమిటీ సభ్యులు కొలికపోగు సర్వేశ్వరరావు, ఓలేటి శ్రీహరి, నాగుల్ మీరా, తిప్పిశెట్టి శివ, అబ్దుల్ రెహమాన్, గుడిమెట్ల బాబు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -