- Advertisement -
రూ.21వేలు ఆర్థికసాయం అందజేత
నవతెలంగాణ – మల్హర్ రావు:-
కాటారం మండలం విలసాగర్ గ్రామానికి చెందిన సీనియర్ గ్రామీణ వైద్యుడు షేక్ అన్వర్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ ఆర్ఎంపీ, పిఎంపీ వెల్పేర్ అసోసియేషన్ కాటారం మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం బాధిత కుటుంబాన్ని పరమర్షించి ఓదార్చారు. అధైర్య పడొద్దు అసోషియేషన్ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. బాధిత కుటుంబానికి అసోసియేషన్ తరుపున రూ.21,500 ఆర్థికసాయం అందజేసి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యులు చక్రవర్తి, మల్లేష్ యాదవ్, కుమారస్వామి, చందు, శ్రీనివాస్ రెడ్డి, మనోహర్, విష్ణువర్ధన్, శ్యామ్, సర్దార్, రాజు పాల్గొన్నారు.
- Advertisement -



