Saturday, July 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేషన్ డీలర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి: తహశీల్దార్

రేషన్ డీలర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి: తహశీల్దార్

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండల తహశీల్దార్ కార్యాలయంలో శనివారం రేషన్ షాప్ డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలోని రేషన్ డీలర్లు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహశీల్దార్ అద్దంకి సునీత మాట్లాడుతూ.. ఈ-కేవైసీ (e-KYC) పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డుదారుల వివరాలను వెంటనే పూర్తి చేయాలని డీలర్లకు సూచించారు. అలాగే గ్రామాల్లో సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి రేషన్ పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో తహశీల్దార్ తో పాటు కార్యాలయ సిబ్బంది, మండలంలోని రేషన్ షాప్ డీలర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -