Monday, July 27, 2026
E-PAPER
Homeఖమ్మంఆరుతడి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి

ఆరుతడి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి

- Advertisement -

– మండల వ్యవసాయ అధికారి డీఎన్‌కే శ్రీనివాసరావు
నవతెలంగాణ-సత్తుపల్లి 

ఎల్ నినో ఏర్పడిన నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ అధికారి డీఎన్‌కే శ్రీనివాసరావు తెలిపారు. ఎల్ నినో ప్రభావం దృష్ట్యా సాగు చేయాల్సిన ఆరుతడి పంటలు, వ్యవసాయ కుంటల గురించి ఇతర శాఖల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం సత్తుపల్లి మండలంలోని  చెరుకుపల్లి, గంగారం, రామానగరం,  యాతాలకుంట, కిష్టాపురం గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించారు. ఎల్ నినో ప్రభావం ఏర్పడడం వల్ల వర్షపాతం తక్కువగా ఉన్నందున రైతులు నీటి అవసరం తక్కువగా ఉన్న పెసర, మినుము, కంది, నువ్వులు, జొన్నలు వంటి ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు కోరారు.  బోర్లు ఉన్న రైతులు మొత్తం విస్తీర్ణంలో 50 శాతం మాత్రమే సాగు చేసుకోవాలని తెలిపారు. అదే విధంగా పంట కుంటల నిర్మాణం చేపట్టడం వల్ల రైతులకు ఏ విధంగా మేలు ఒనగూరుతుందో వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారులు ఆశాజ్యోతి, నరేష్, అనూష, సాయి వాసంతి, ఇతర శాఖల  అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -