Saturday, August 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి 

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి 

- Advertisement -

కరస్పాండెంట్  జోసెఫ్ 
నవతెలంగాణ-మిడ్జిల్ 

ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడా రంగాలలో రాణించాలని, సెట్ మేరీ హై స్కూల్ కరస్పాండెంట్ ఎంప్రయిల్ జోసెఫ్ చెప్పారు. జాతీయ క్రీడ దినోత్సవం సందర్భంగా బుధవారం మండల కేంద్రంలోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో క్రీడా దినోత్సవం నిర్వహించారు.  ఈ క్రీడా దినోత్సవంతో పాటు మేజర్ ధ్యాన్ చంద్ జయంతినీ నిర్వహించి  ఆయన చిత్రపటానికి పూలమాల  వేశారు. పాఠశాల క్రీడలు విద్యార్థులకు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండడానికి తోడ్పడతాయని ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల, ప్రిన్సిపాల్ డైసన్, డైరెక్టర్లు శీనా జోసెఫ్,మినీ డైసన్ మరియు ఉపాధ్యాయులు లింగం,రవికుమార్, షినిష్, పి ఈ టి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -