నవతెలంగాణ – జుక్కల్: మండలంలోని పెద్దగుల్ల తాండ లో గ్రామ సర్పంచ్ రాథోడ్ సుమతి యశ్పాల్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించామని జిపి కార్యదర్శి నాగయ్య తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గ్రామ సర్పంచ్ రాథోడ్ సుమతి యశ్పాల్ మరియు జిపి కార్యదర్శి నాగయ్య మాట్లాడుతూ అంబేద్కర్ పుట్టిన నాటి నడి బాల్యంలో పలు కులవివక్షత సమస్యలను ఎదుర్కోవడం జరిగిందని తెలిపారు. 1927లో మహద్లో దళిత మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. గుజరాత్ , మహారాష్ట్ర నుండి వేలాది మది దళితులు తరలివచ్చారు. మహద్ చెరువులోని నీటిని త్రాగడానికి వీలుండేది కాదు. అంటరాని వారికి ఆ చెరువులో ప్రవేశం లేకుండా పోయింది. అంబేద్కర్ గారి నాయకత్వంలో వేలాదిమంది చెరువు నీళ్ళు స్వీకరించారు అప్పుడు ఆ వార్త సంచలనం సృష్టించింది. 1927లో డాక్టర్ అంబేద్కర్ ” బహిష్కృత భారతి” అనే మరాఠీ పక్ష పత్రిక ని స్థాపించడం జరిగింది. నేడు భారతదేశం రాజ్యాంగం బద్దంగా కొనసాగుతుందంటే అది అంబేద్కర్ పుణ్యమైన అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్, జిపి కార్యదర్శి నాగయ్య, వార్డు సభ్యులు, యువకులు, మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
పెద్ద గుల్ల తాండాలో సర్పంచ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



