గతంలో కూడా రూ.2 లక్షల అక్రమాలు
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలంలో నీమా నాయక్ తండాలోని శ్రీ దత్తాత్రేయ సమభావన సంఘం వీబీకే పనిచేస్తున్న అసంఘ మొదటి లీడర్ రామావత్ సుశీల సంఘ సభ్యులకు తెలియకుండా రూ. 5 లక్షలు అక్రమానికి పాల్పడ్డారు. ఎలాంటి తీర్మానం చేయకుండా దొంగతనంగా మా సంఘ సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి, డాక్యుమెంట్ తయారు చేసుకొని ఐదు రూ.5 లక్షలు లోను తీసుకున్నారని శ్రీ దాత్తాత్రేయ సంభావన సంఘం సభ్యులు ఈ నెల 8న జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ కు, డీఆర్ఢీఓ మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా బాద్యుల పై చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
సిసి ఇంచార్జి హైమావతి, స్త్రీనిధి మేనేజర్ శ్యాంసుందర్, మరో సిసి సత్యనారాయణ వారికీ సహకరించినారని ఆరోపించారు. శ్రీ దాత్తా త్రేయ సమభావన సంఘం పేరుతో, ఇంకా మూడు సంఘాల పేరుతో ఐదు లక్షల లోను తీసుకొని వాటాలు పంచుకున్నట్లు సమాచారం. ఈ విషయంమై సిసి అడుగగా, ఇందిరమ్మ ఇల్లు హౌజ్ ను అని చెప్పి రెండవ లీడరుతో సంతకం పెట్టించుకున్నదని ఆరోపించారు.
గతంలో కూడా ఇదే సంఘ సభ్యులకు తెలియకుండా రూ.2 లక్షల లోను తీసుకొని వాటాలు పంచుకున్నారని సంఘ సభ్యులు రమావత్సరిత, రమావత్ చిట్టి, రమావత్ నాగమ్మ, రమావత్ అమాలి, రమావత్ శారద, జ్యోతి, సుజాత, లక్ష్మి, సిరి ఆరోపించారు. ఈ ఐదు లక్షలలో కోమటి కుంట తండా వీబీకే అకౌంట్ లో రూ. 2 లక్షలు, శ్రీనిధి మేనేజర్ అకౌంట్ లో రూ.3 లక్షలు వున్నాయని తెలిపారు. అయితే వీరి ఇద్దరి అకౌంట్ లను బ్లాక్ చేయించామని సంఘ బంధం సభ్యులు తెలిపారు. ఈ విషయమై బుధవారం నీమానాయక్ తండా లో ఏపీఎం రాందాస్ నాయక్, స్థానిక సర్పంచ్ రమావత్ బాబూ నాయక్ ఆధ్వర్యంలో బుధవారం సంఘ సభ్యులతో సమావేశం నిర్వహించి విచారణ చేపట్టారు. సంఘ సభ్యులకు తెలవకుండా లోన్ తీసుకున్న వారితో, ఇచ్చిన వారితో మాట్లాడీ ఆ ఐదు లక్షల సంఘ సభ్యులందరికి చేరే విదంగా చేయాలని తీర్మానించారు. దీనికి అందరూ ఒప్పుకున్నట్లు ఏపీఎం రాం దాస్ నాయక్ తెలిపారు.



