Thursday, April 16, 2026
E-PAPER
Homeసినిమాఅందరూ సర్‌ప్రైజ్‌ అవుతారు..

అందరూ సర్‌ప్రైజ్‌ అవుతారు..

- Advertisement -

నాగ శౌర్య హీరోగా, రామ్‌ దేశినా (రమేష్‌) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్‌ యాక్షన్‌ డ్రామా ‘బ్యాడ్‌ బారు కార్తీక్‌’. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్‌ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతల పూడి నిర్మించారు.
ఈ నెల 17న ఈ సినిమా విడు దలకు సిద్ధమవుతున్న సందర్భంగా నిర్మాత శ్రీనివాసరావు చింతలపూడి మీడియాతో ముచ్చటించారు.
ఆది సాయికుమార్‌ ‘శశి’ సినిమాకు ఒక భాగస్వామిగా చేశాను. నిర్మాతగా ఇది నా ఫస్ట్‌ సినిమా. సినిమా చాలా బాగా వచ్చింది. రిలీజ్‌ కోసం చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాం. ఇది అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. శౌర్యని ఇప్పటివరకు లవర్‌ బారు క్యారెక్టర్స్‌లో చూశారు. ఇందులో పూర్తిగా యాక్షన్‌ టోన్‌తో చూస్తారు.
ఈ సినిమాలో టాప్‌ నాచ్‌ టెక్నీషియన్స్‌ పనిచేశారు. ‘యానిమల్‌’ సినిమాకు పనిచేసిన సుప్రీం సుందర్‌, అలాగే పథ్వి యాక్షన్‌ కొరియోగ్రాఫర్స్‌గా పనిచేశారు. హరీష్‌ జయరాజ్‌ అద్భుతమైన ఆల్బమ్‌ ఇచ్చారు. శోభి మాస్టర్‌, రాజు సుందరం మంచి కొరియోగ్రఫీ చేశారు. సినిమాలో మంచి తారాగణం ఉంది. సముద్రఖని, నరేష్‌, సాయికుమార్‌, వెన్నెల కిషోర్‌, శ్రీదేవి విజరు కుమార్‌ చాలా మంచి పాత్రలు చేశారు. ఇందులో శ్రీదేవి విజరు కుమార్‌ పాత్ర ఒక హైలెట్‌గా ఉండబోతుంది. ఆమె పాత్ర చాలా సర్‌ప్రైజ్‌ చేస్తుంది. ఈ సినిమా తర్వాత ఆమె చాలా బిజీ అవుతారు.
జీ స్టూడియోస్‌ వారు సినిమా మొత్తం చూసి ఓటిటి తీసుకుంటామని చెప్పారు. అలాగే డిస్ట్రిబ్యూషన్‌ కూడా చేస్తామని ముందుకు వచ్చారు. దాదాపు 400కి పైగా స్క్రీన్లలో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నాం.
ఈ సినిమా తర్వాత శౌర్యకి మాస్‌ యాక్షన్‌ హీరో ఇమేజ్‌ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. డబుల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చేలా ఉంటుంది.
ఈ సినిమాని ఎక్కడా రాజీ పడకుండా తీశాము. నైజాంలో అన్నపూర్ణ స్టూడియోస్‌ రిలీజ్‌ చేస్తుంది. సినిమాను ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరేలా అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. సినిమా చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. సినిమా తొలి 15 నిమిషాల నుంచి చివరి వరకు ఆడియన్స్‌ చాలా ఎంజారు చేస్తారు. ప్రతి యాక్షన్‌ సీన్‌ అద్భుతంగా ఉంటుంది. ఓ పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -