Thursday, April 16, 2026
E-PAPER
Homeసినిమాచిన్న చిత్రాల్లో బెంచ్‌ మార్క్‌ సెట్‌ చేస్తుంది

చిన్న చిత్రాల్లో బెంచ్‌ మార్క్‌ సెట్‌ చేస్తుంది

- Advertisement -

న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేస్తూ హీరో కిరణ్‌ అబ్బవరం సుమైర స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్‌ పై నిర్మిస్తున్న సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సాయి తేజ్‌, వేద జలంధర్‌ హీరో, హీరోయిన్స్‌గా, వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే పీరియాడిక్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను మేకర్స్‌ ఘనంగా నిర్వహించారు.
ఈటీవీ విన్‌ బిజినెస్‌ హెడ్‌ సాయికష్ణ మాట్లాడుతూ,’కొత్త వాళ్లతో చిన్న సినిమా చేయాలంటే ధైర్యం కావాలి. కిరణ్‌కి అలాంటి ధైర్యం ఉంది. ఆయన ఈ సినిమా గురించి నాకు చెప్పారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ అమేజింగ్‌ టాలెంట్‌ ప్రదర్శించారు’ అని చెప్పారు.
‘నేను చిన్నప్పటి నుంచి మా అమ్మకు,చెల్లికి ఏమీ కొనివ్వలేదు.ఈ నెల 17న తిమ్మరాజుపల్లి టీవీ రిలీజ్‌ అయ్యాక మీరంతా గర్వపడేలా చేస్తాను. మనకు ఎంత ప్రతిభ ఉన్నా, అవకాశం ఇచ్చేవాళ్లే గొప్ప. ‘మీటర్‌’ సినిమా టైమ్‌లో కిరణ్‌ని కలిశాను. ఆయన ఈ చిత్రాన్ని ఇంత గ్రాండ్‌గా ప్రమోట్‌ చేసి రిలీజ్‌కు తీసుకొస్తున్నారు. కేఏ ప్రొడక్షన్స్‌ నాకు ఫ్యామిలీ లాంటిది. ఈ సంస్థను వదులుకోను. రహస్య మమ్మల్మి తల్లిలా చూసుకుంటారు. మా సినిమా చూడండి. గ్యారెంటీగా మీకు నచ్చుతుంది’ అని డైరెక్టర్‌ వి.మునిరాజు చెప్పారు.
కేఏ ప్రొడక్షన్స్‌ సీయీవో రహస్య కిరణ్‌ మాట్లాడుతూ,’ఈ తరం జెన్‌ జీ కిడ్స్‌కు అప్పటి విలేజ్‌ ట్రెడిషన్స్‌, ఆ వాతావరణం తెలియదు. మా మూవీ చూస్తే మీరంతా ఆ టైమ్‌ కల్చర్‌ను ఎంజారు చేస్తారు’ అని తెలిపారు.
‘మా అమ్మానాన్న, అన్నయ్య ఆశీస్సుల వల్లే ఈ వేదిక మీద ఉండగలిగాను. నేను చేసే ప్రయత్నాలకు మీరంతా సపోర్ట్‌గా నిలుస్తున్నారు. మా ముని గురించి, హీరోహీరోయిన్స్‌ ఇతర టీమ్‌ అందరి గురించి ఈ నెల 17వ తేదీ తర్వాత మాట్లాడుతా. వాళ్లంతా అద్భుతమైన వర్క్‌ చేశారు. చిన్న చిత్రాల్లో ఈ సినిమా బెంచ్‌ మార్క్‌ సెట్‌ చేయబోతోంది’ అని నిర్మాత కిరణ్‌ అబ్బవరం చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -