Thursday, April 16, 2026
E-PAPER
Homeసినిమాఎమ్మెస్‌ రాజు దర్శకత్వంలో 'అగధ'

ఎమ్మెస్‌ రాజు దర్శకత్వంలో ‘అగధ’

- Advertisement -

ఎమ్మెస్‌ రాజు నిర్మాతగానే కాకుండా దర్శకునిగా కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ‘డర్టీ హరి’, ‘మళ్లీ పెళ్లి’ చిత్రాలు ఆయన దర్శకత్వానికి నిదర్శనాలు. ఏం చేసినా ప్రేక్షకులకు ఒక యూనిక్‌ ఎక్స్పీరియన్స్‌ ఇవ్వాలన్నదే ఆయన లక్ష్యం. అందుకోసమే ఆయన ‘అగధ’ను సిద్ధం చేస్తున్నారు.
ఏడాది కాలంగా ఆయన ఈ ప్రాజెక్టు మీదనే శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ చిత్ర ప్రమోషన్స్‌ విభిన్నంగా మొదలు పెట్టారు. ఇందుకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్‌ ఫన్నీ వీడియోను విడుదల చేశారు. ఇద్దరు దొంగలు ఎమ్మెస్‌ రాజు ఆఫీసులో దొంగతనానికి వెళ్లడం, అక్కడున్న సినిమా పోస్టర్స్‌ని చూస్తూ ఆ దొంగలు ఆ సినిమా జ్ఞాపకాలను తలుచుకోవడం, చివరగా ఒక పోస్టర్‌ని చూసి అక్కడ ఏదో ఉందని భయ పడటంతో ఆ వీడియో ఎండ్‌ అవుతుంది. తీరా అక్కడ ఉన్నది ‘అగధ’ సినిమా పోస్టర్‌. ఆ పోస్టర్‌ను బుధవారం విడుదల చేశారు.
శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎమ్మెస్‌ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎమ్మెస్‌ రాజు మాట్లాడుతూ, ‘ఇదొక మిస్టికల్‌ డివైన్‌ థ్రిల్లర్‌. ఇందులో నటించిన తారలు ఎవరనేది త్వరలో తెలియజేస్తాం. రకరకాల సెట్లు, విభిన్న లొకేషన్లలో 85 రోజులు షూటింగ్‌ చేసాం. ఈ సినిమాలో 45 నిమిషాలు విఎఫ్‌ఎక్స్‌ ఉంటుంది. దాన్నిబట్టే ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అతిత్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కిన్‌ అరుల్‌ దేవ్‌, ఛాయాగ్రహణం : నాని చమిడిశెట్టి, ఎడిటర్‌: జునైద్‌ సిద్దిఖీ, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రాజీవ్‌ నాయర్‌, అడిషనల్‌ స్క్రీన్‌ ప్లే: చైతన్య వేగి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఎన్‌.వి.ఎన్‌. సుబ్బరాజ్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -