- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో బొలెరో వాహనం రెడీమిక్స్ లారీని ఢీకొనడంతో 8 మంది మృతిచెందగా, 12 మంది గాయపడ్డారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు. గాయపడిన వారిని ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. కర్ణాటకలోని చిక్‌మంగళూరుకు చెందిన భక్తులు మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
- Advertisement -



