Thursday, April 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహార్ముజ్‌లో కూలిన అమెరికా నిఘా డ్రోన్‌

హార్ముజ్‌లో కూలిన అమెరికా నిఘా డ్రోన్‌

- Advertisement -

దాని విలువ రూ.2,222 కోట్లు
న్యూయార్క్‌:
ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా 238 మిలియన్‌ డాలర్ల (రూ.2,222 కోట్ల) విలువైన నిఘా డ్రోన్‌ను నష్టపోయింది . ఏప్రిల్‌ 9న హర్మూజ్‌ జలసంధిలో ఈ ఘటన జరిగినట్టు ఇప్పటికే వార్తలు రాగా.. తాజాగా అమెరికా నేవీ ధ్రువీకరించింది. ఎంక్యూ-4జ ట్రైటన్‌ పేరున్న దీనిపై ఎటువంటి దాడి జరగలేదని.. సాంకేతిక లోపంతో కూలిపోయినట్టు పేర్కొంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని వెల్లడించింది.అంతర్జాతీయ గగనతలంలో హార్ముజ్‌ జలసంధిపై గస్తీలో ఉండగా ట్రైటన్‌.. అకస్మాత్తుగా ఎమర్జెన్సీ కోడ్‌ను రిలీజ్‌ చేసింది. ఆ తర్వాత 50వేల అడుగుల ఎత్తు నుంచి 10వేల అడుగుల ఎత్తుకు దిగొచ్చింది. అనంతరం కనిపించకుండా పోయింది. నేవీ సేఫ్టీ కమాండ్‌ దీనిని క్లాస్‌ ఏ ప్రమాదం గా వర్గీకరించింది. 2 మిలియన్‌ డాలర్లకుపైగా నష్టాన్ని, ఎయిర్‌క్రాఫ్ట్‌ పూర్తిగా ధ్వంసం కావడాన్ని దీనికింద పరిగణిస్తారు. తాజాగా ఈ ప్రమాదాన్ని ధ్రువీకరించిన అమెరికా.. ఏ ప్రాంతంలో జరిగిందో మాత్రం బయటపెట్టలేదు.ఈ ట్రైటన్‌.. అమెరికా నేవీ ఆయుధశక్తిలో ఈ అధునాతన మానవరహిత వైమానిక వ్యవస్థల్లో ఒకటి. అధిక ఎత్తులో, సుదూర మిషన్ల కోసం దీనిని తీర్చిదిద్దారు. వ్యూహాత్మక జలమార్గాల్లో మారిటైమ్‌ ట్రాఫిక్‌, మిలిటరీ కదలికలను పర్యవేక్షించడంలో ఇది కీలకం. ఇప్పుడు దీనిని కోల్పోవడం అనేది యూఎస్‌ నేవీకి గట్టి దెబ్బే అని చెప్తున్నారు. ఇక, అమెరికా-ఇరాన్‌ కాల్పుల విరమణకు అంగీకరించిన అనంతరం ఈ ఘటన జరగడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -