Thursday, April 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంలొంగదీసుకునే ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవు

లొంగదీసుకునే ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవు

- Advertisement -

అమెరికాకు ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ హెచ్చరిక
టెహ్రాన్‌:
ఇరాన్‌ ఓడరేవులను లక్ష్యంగా చేసుకుని అమెరికా విధించిన దిగ్బంధనం నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై బలప్రయోగం చేయాలనే ఏ ప్రయత్నమైన విఫలమవుతుందని స్పష్టం చేశారు. కాల్పుల విరమణ పరిస్థితులు, పూర్తి స్థాయి శాంతి కోసం చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు ఈ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తమకు ఇచ్చిన ఓ ప్రకటనలో పెజెష్కియాన్‌ పేర్కొనట్టు ఇరాన్‌ ప్రభుత్వ మీడియా తెలిపింది.’ఇరాన్‌ నిర్మాణాత్మక సంభాషణకు కట్టుబడి ఉన్నప్పటికీ, ఎలాంటి ఒత్తిడి లేదా బలవంతానికి తలొగ్గదు. ఇరాన్‌ యుద్ధాన్ని కోరుకోవడం లేదు. కానీ మమ్మల్ని బలవంతంగా లొంగదీసుకునే ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవు. ప్రజలు అలాంటి చర్యలను ఎప్పటికీ అంగీకరించరు. ఇక ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్‌ తీసుకున్న చర్యలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. ఈ దాడులు పౌర మౌలిక సదుపాయాలపై ప్రభావం చూపుతాయి. అసలు ఎలాంటి అనుమతితో మా దేశంపై దాడులు జరుగుతున్నాయి? పౌరులపై, ఆసుపత్రులు, పాఠశాలలపై దాడులు చేయడానికి ఏ న్యాయం ఉంది? ఇరాన్‌ శాంతి, దౌత్యపరమైన పరిష్కారాలను కోరుకుంటున్నప్పటికీ, దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే చర్యలను కఠినంగా ఎదుర్కొంటాం’ అని పెజెష్కియాన్‌ హెచ్చరించినట్టు ఇరాన్‌ ప్రభుత్వ మీడియా పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -