- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సరదాగా నదిలో స్నానానికి వెళ్ళిన ఓ యువతికి ఊహించని అనుభవం ఎదురైంది. నీటిలో కదులుతున్న చిన్న జీవిని చేప పిల్ల అనుకొని పట్టుకున్న ఆమెకు, అది మొసలి పిల్ల అని తెలియడంతో భయంతో వణికిపోయింది. వెంటనే ఆ మొసలి పిల్లను నీటిలో వదిలేసి ఒడ్డుకు పరుగులు తీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు యువతి అమాయకత్వాన్ని చూసి నవ్వుకుంటూనే, ప్రమాదం తృటిలో తప్పిందని వ్యాఖ్యానిస్తున్నారు.
- Advertisement -



