Thursday, April 16, 2026
E-PAPER
Homeజాతీయంమహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయ కోణంలో చూడవద్దు : మోడీ

మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయ కోణంలో చూడవద్దు : మోడీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మహిళా రిజర్వేషన్ బిల్లు దేశ రాజకీయాల దిశ, దశను మార్చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశ జనాభాలో సగభాగమైన మహిళలు నిర్ణయాధికార ప్రక్రియలో పాలుపంచుకోవడం ద్వారా దేశానికి కొత్త దిశానిర్దేశం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కీలక బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్… రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, 2026, డీలిమిటేషన్ బిల్లు, 2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు, 2026లను సభ ముందు ఉంచారు. అయితే, ఈ బిల్లును ప్రవేశపెట్టే సమయంలో విపక్షాలు మూజువాణి ఓటింగ్‌ను అంగీకరించలేదు. ఓట్ల విభజన (డివిజన్)కు పట్టుబట్టడంతో సభలో ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చింది.

బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 251 ఓట్లు, వ్యతిరేకంగా 185 ఓట్లు పోలైనట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. సాధారణంగా లోక్‌సభలో మూజువాణి ఓటు ద్వారానే తీర్మానాలు ఆమోదిస్తారు. కానీ, ఫలితంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు సభ్యుల కోరిక మేరకు డివిజన్ నిర్వహిస్తారు. ఆటోమేటిక్ ఓట్ రికార్డర్ వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియను పూర్తిచేశారు. ఆ తర్వాత ఓటు స్లిప్పుల ద్వారా జరిగిన ఓటింగ్‌లో మొత్తం 333 మంది సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, పార్టీలు ఈ బిల్లును రాజకీయ కోణంలో చూడవద్దని విజ్ఞప్తి చేశారు. వికసిత భారత్ @2047 లక్ష్యాన్ని చేరుకోవడంలో మహిళా రిజర్వేషన్లు కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. గతంలో ఈ బిల్లును వ్యతిరేకించిన వారికి మహిళా ఓటర్లు తగిన గుణపాఠం చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -