నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని జుక్కల్ కేంద్రంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలంలోని పలు గ్రామాల ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా మమ్మదాబాద్ సర్పంచ్ సూర్నార్ శకుంతల బాలు, మాదాపూర్ సర్పంచ్ ఆశా చందర్ పాటిల్ , పడంపల్లి సర్పంచ్ వాగ్మారే విజయ కుమారి సంజు, జాదవ్ సునంద, చాకలి కృష్ణ, కే. శ్రీనివాస్ పాటు పలువురు గ్రామ సర్పంచులు మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధి, పారదర్శక పాలన, సంక్షేమ పథకాల సమర్థ అమలు లక్ష్యంగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతుందని తెలిపారు. ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆమె అన్నారు.
జుక్కల్ ప్రాంత అభివృద్ధి ప్రధాత, శాసనసభ్యులు తోట లక్ష్మి కాంతారావు కృషి వల్ల రోడ్లు, తాగునీరు, విద్య, ఆరోగ్య రంగాలలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎమ్మార్వో మారుతి, ఎంపీ ఓ రాము, ఏవో మహేశ్వరి, మెడికల్ ఆఫీసర్ విట్టల్, పంచాయతీరాజ్ ఏఈ శ్రీకాంత్ రెడ్డి, ఎఫ్ఆర్ సంతోషి, 30 గ్రాముల సర్పంచులు, జిపి కార్యదర్శులు, అంగన్వాడీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సర్పంచ్ లందరికీ ఉపసర్పంచ్ లకి వార్డ్ మెంబర్లకి ధన్యవాదాలు తెలిపారు.



